News December 21, 2024

విశాఖ: అక్రమంగా అమ్మాయిలను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

అక్రమంగా 11 మంది అమ్మాయిలను ఒడిశాలోని నవరంగ్‌పూర్ నుంచి చెన్నై ట్రైన్‌లో  తరలిస్తున్న నిందితుడు రవికుమార్‌ను శనివారం అరెస్టు చేశామని విశాఖ రైల్వే సీఐ ధనంజయ నాయుడు తెలిపారు. 11 మందిని పని పేరుతో అక్రమంగా ఆధార్ టాంపర్ చేసి గార్మెంట్‌లో పని కోసం తిమ్మాపూర్ తరలిస్తున్నారని గుర్తించామని అన్నారు. అక్రమ రవాణా, ఆధార్ టాంపరింగ్‌పై సెక్షన్ 143 (5)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 23, 2025

వైద్యం ప్రైవేట్ పరమైతే ఊరుకోం: బొత్స

image

మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలన్నది తమ పార్టీ విధానమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే వైసీపీ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని విమర్శించారు.

News December 23, 2025

జనవరి నుంచి రేషన్ డిపోలో గోధుమపిండి: విశాఖ జేసీ

image

విశాఖలో అన్ని రేషన్ డిపోలలో జనవరి నెల నుంచి గోధుమపిండి పంపిణీ చేయనున్నట్లు జేసీ మయూర్ అశోక్ మంగళవారం తెలిపారు. బియ్యం, పంచదార, రాగులతో పాటు గోధుమపిండి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేజీ గోధుమపిండి రూ.20కి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News December 23, 2025

విశాఖలో రూ.27 కోట్ల జీఎస్టీ మోసం

image

విశాఖపట్నం డీజీజీఐ డిప్యూటీ డైరెక్టర్ శ్వేతా సురేష్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో రూ.27.07 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. ఎటువంటి వస్తు సరఫరా లేకుండా నకిలీ ఐటీసీని సృష్టించిన ఈ నెట్‌వర్క్ సూత్రధారి మల్లికార్జున మనోజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యల్లో భాగంగా విశాఖ జోనల్ యూనిట్ ఈ ఏడాది చేసిన నాలుగో అరెస్టు ఇది అని అధికార వర్గాలు తెలిపాయి.