News May 8, 2024
విశాఖ: అత్యధిక, అత్యల్ప మెజార్టీలు టీడీపీ ఖాతాలోనే
ఉమ్మడి విశాఖ జిల్లాలోని 1983లో విశాఖ-2 నియోజకవర్గ TDP అభ్యర్థిగా పోటీ చేసిన ఈ.వాసుదేవరావు తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పల్లా సింహాచలంపై 47,916 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత 47,883 ఓట్ల భారీ మెజారిటీని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు 2019లో గెలిచారు. 1985లో పాడేరు నుంచి TDP అభ్యర్థిగా పోటీ చేసిన కొట్టగుళ్లి చిట్టినాయుడు 113 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
Similar News
News January 24, 2025
పాయకరావుపేటలో ఎయిర్ పోర్ట్‌కు ప్రతిపాదనలు
పాయకరావుపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముందు తుని-అన్నవరం మధ్య ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రాంతం అనుకూలం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు సమాచారం. పాయకరావుపేట ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండడంతో నిర్మాణానికి అన్ని విధాల అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు భూముల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
News January 24, 2025
విశాఖ పోలీసుల అదుపులో నకిలీ మహిళా ఐఏఎస్..!
ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మహిళాIASతో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అమృత భాగ్యరేఖ అనే మహిళ MVPకాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి విశాఖCPకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో పోలీసులు విచారించగా ఆమె నకిలీ IASగా నిర్ధారణ అయింది.
News January 24, 2025
కొత్తపల్లి జలపాతం నాలుగు రోజులు మూసివేత
జీ.మాడుగుల మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతాన్ని ఈనెల 24 నుంచి 27 వరకు మూసివేస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. జనవరి 24వ తేదీ నుంచి 27 వరకు జలపాతం ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ఎవరికి ప్రవేశం లేదని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు కొత్తపల్లి జలపాతం సందర్శించవద్దని అభిషేక్ పేర్కొన్నారు.