News September 9, 2025
విశాఖ: ‘అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షిస్తాం’

మూగ బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్ రాయపాటి శైలజ తెలిపారు. కేజీహెచ్‌లో మంగళవారం ఆమె బాధితురాలిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కామాధులకు కళ్ళు తెరిచేలా శిక్ష పడుతుందని అన్నారు.
Similar News
News September 9, 2025
పోక్సో కేసులో ముద్దాయిని పట్టుకున్న మహారాణిపేట పోలీసులు

మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసులో ముద్దాయి షేక్ అబ్దుల్ కలాం 18 నెలల నుంచి కోర్టుకు హాజరు కావడం లేదు. కోర్ట్ ఆదేశాల మేరకు పోలీసులు హైదరాబాద్, అనంతపురం జిల్లాలో విస్తృతంగా గాలించారు. సెల్‌ఫోన్ కూడా ఉపయోగించకుండా తిరుగుతున్న ముద్దాయిని మంగళవారం చాకచక్యంగా పట్టుకోవడంతో సిబ్బందిని సీపీ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.
News September 9, 2025
విశాఖ: ‘అధ్యయన యాత్రలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’

జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్రలపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. 2021 నుంచి ఇప్పటివరకు 4 సార్లు అధ్యయన యాత్రలకు వెళ్లారని తెలిపారు. ఈనెల 15 నుంచి 23 వరకు మరోసారి అధ్యయన యాత్ర కోసం రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేందుకు జీవీఎంసీ సిద్ధమైందన్నారు. గతంలో జరిగిన అధ్యయన యాత్రలు విహారయాత్రలుగా మిగిలాయన్నారు.
News September 9, 2025
కేజీహెచ్‌లో సిట్ విచారణ..?

సృష్టి కేసులో కేజీహెచ్ వైద్యుల వ్యవహారం నిగ్గు తేల్చేందుకు సిట్ రెండు రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది. కేజీహెచ్‌లో పనిచేసిన ముగ్గురు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసులు చేస్తున్నారని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో సిట్ రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లా వైద్యశాఖ నుంచి తెలంగాణ సీట్ పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం.