News March 28, 2025
విశాఖ: అన్నయ్య మందలించడంతో సూసైడ్

అన్నయ్య మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జై భారత్ నగర్‌లో ప్రతాప్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రతాప్ శుక్రవారం డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆయన అన్నయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News March 31, 2025
విశాఖలో ఐదేళ్ల బాలిక పట్ల పీటీ అసభ్యకర ప్రవర్తన

విశాఖలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధురవాడ పరిధిలో జరిగింది. వాంబే కాలనీలోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పీటీగా పనిచేస్తున్న రామచంద్రరావు ఐదేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆ చిన్నారి భయపడి తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పింది. వెంటనే వీరు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీటీని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
News March 31, 2025
విశాఖ: మహిళను నిండా ముంచిన రాంగ్ కాల్

శ్రీకాళహస్తికి చెందిన B.అక్షయ్ విశాఖకు చెందిన మహిళ(35)కు రాంగ్ కాల్ ద్వారా పరిచయమయ్యాడు. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా మెసేజ్‌లు చేశాడు. కొంతకాలం తర్వాత మెసేజ్‌లు ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేసి రూ.10లక్షలు దోచేశాడు. ఆమెపై లైంగిక దాడి చేసి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి వేధించాడు. చివరకు మహిళ భర్త సాయంతో త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు.
News March 31, 2025
విశాఖ: యువకుడిపై కోపంతో బైక్‌లకు నిప్పు పెట్టిన యువతి

విశాఖలోని సింగ్ హోటల్ జంక్షన్ సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో శుక్రవారం అర్ధరాత్రి 18 బైకులు దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే ఓ యువతి ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తితో విభేదాల కారణంగా అతని బైక్‌కు నిప్పు పెట్టగా ఆ మంటలు మిగతా బైక్‌లకు కూడా అంటుకుని దగ్ధమయ్యాయి. సదరు మహిళ ఆ యువకుడిని గతంలో ప్రేమించిందని అతడికి వేరొకరితో పెళ్లి కావడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.