News March 8, 2025

విశాఖ: అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే ఆత్మహత్య

image

అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే చచ్చిపోతున్నా.. అంటూ ఓ మహిళ వాయిస్ మెసేజ్ కలకలం సృష్టించింది. కొబ్బరి తోటకు చెందిన ధనలక్ష్మి వద్ద సుగుణ అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య వివాదం జరగ్గా ధనలక్ష్మి, ఆమె కుమారుడు సుగుణతో గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన సుగుణ.. గురువారం ధనలక్ష్మి ఇంటికి వెళ్లి రూమ్‌లో తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సుగుణ బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.

Similar News

News September 14, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మోదీ ఆదుకుంటున్నారు: మాధవ్

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వాజపేయి ఆదుకున్నట్టే నేడు మోదీ ఆదుకుంటున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. సారథ్యం యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమెరికా టారిఫ్‌లతో ఏపీలో పలు వర్గాలు నష్టపోతున్నాయని, ఆత్మనిర్భర్ భారత్ దీన్ని పరిష్కరించగలదని పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యమాన్ని ఏపీ బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. బీజేపీని ఇంటింటికి విస్తరించడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు.

News September 14, 2025

‘బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధిని వివరించండి’

image

దేశ ఆర్థిక వ్యవస్థ 2014లో 11వ స్థానంలో ఉండగా మోదీ నేతృత్వంలో ఇప్పుడు మూడో స్థానానికి చేరిందని
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రక్షణ రంగం, రహదారులు, పోర్టులు, రైల్వేలు, వైద్య కళాశాలలు, విమానాశ్రయాలు ఇలా అన్ని రంగాల్లో విస్తృత అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. కార్యకర్తలు గ్రామ గ్రామానికీ వెళ్లి NDA అభివృద్ధిని వివరించాలని పిలుపునిచ్చారు.

News September 14, 2025

వికసిత్ భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యం: జేపీ నడ్డా

image

వికసిత భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో సారద్యమ్ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 15 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు అంకితభావం వల్లే ఈ మార్పు సాధ్యమైందన్నారు.