News October 4, 2025
విశాఖ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి: గంటా

రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రూ.55 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తమ బినామీల భూములను కాపాడుకునేందుకే రైతుల పేరుతో కోర్టులో కేసులు వేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
Similar News
News October 3, 2025
బినామీ భూముల కోసమే గూగుల్‌కు అడ్డు: పల్లా

విశాఖలో గూగుల్ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ అడ్డుకుంటోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. జగన్ హయాంలో ఆక్రమించుకున్న బినామీ భూములను కాపాడుకోవడానికే రైతుల ముసుగులో కోర్టుకెళ్లి రూ.50,000 కోట్ల పెట్టుబడిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ కృషితో వస్తున్న ఈ ప్రాజెక్టును నిలిపివేసి, యువత భవిష్యత్తుతో వైఎస్సార్సీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.
News October 3, 2025
మధురవాడ ఆర్టీసీ డిపోలో ఉద్యోగావకాశాలు

మధురవాడ ఆర్టీసీ డిపోలో టైర్ మెకానిక్‌గా పనిచేయుటకు అనుభవం ఉన్న వ్యక్తులు నియామకం చేస్తున్నట్లు డీఎం ఈఎస్కే దుర్గ తెలిపారు. అలాగే సీనియర్ మెకానిక్‌ల వద్ద హెల్పర్లుగా పనిచేయడానికి ఐటీఐ అర్హత గల అభ్యర్థులు కావాలన్నారు. ఆసక్తి ఉన్నవారు మధురవాడ డిపో నందు సంప్రదించాలని కోరారు.
News October 3, 2025
వేపగుంట: చికిత్స పొందుతూ హోంగార్డు మృతి

వేపగుంట ప్రాంతానికి చెందిన హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రుద్ర నాయుడు మద్యం సేవించి గురువారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. అనంతరం గదిలోకి వెళ్లి ఉరి వేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.