News October 8, 2025

విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ తీర్మానించింది: గంటా

image

విశాఖలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వైకాపా తన ఉత్తరాంధ్ర సమావేశంలో తీర్మానం చేసిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. గతంలో తాము జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు దర్శి, సత్తెనపల్లి వంటి అనేక ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చామని గుర్తుచేశారు. కానీ వైకాపా మాత్రం విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు.

Similar News

News October 8, 2025

అంతా అయ్యాక ఎంట్రీ ఇచ్చిన వైసీపీ..!

image

పెదగంట్యాడలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయసేకరణలో స్థానిక YCP నాయకుల తీరు చర్చనీయాంశమయ్యింది. అధికారులు రాకముందే స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు, 64వవార్డు కార్పొరేటర్ గోవింద్ రెడ్డి(జనసేన), 75వ కార్పొరేటర్ పూలి లక్ష్మీభాయి(TDP) సభా ప్రాంగణానికి చేరుకుని <<17947721>>ఆందోళనలో<<>> పాల్గొన్నారు. అయితే అంతా అయ్యాక గాజువాక వైసీపీ ఇన్‌ఛార్జ్ తిప్పల దేవాన్‌రెడ్డి స్థానిక నాయకులతో ఎంట్రీ ఇచ్చారు.

News October 8, 2025

ఎల్ఆర్ఎస్‌ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్

image

ఎల్ఆర్ఎస్ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ పథకం కింద తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని అన్నారు. దీనివల్ల భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు.

News October 7, 2025

‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

image

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు. ‌