News March 26, 2025

విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక.. అంశాలివే..!

image

➤ 98 ఎకరాల్లో 5 సోలార్ ప్లాంట్లు, 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
➤ ట్రాఫిక్ నియంత్రణకు 72.82 కి.మీ. పొడవున 15 రహదారులు జూన్ నాటికి పూర్తి
➤ జీవీఎంసీ పరిధిలో ఐదు చోట్ల వర్కింగ్ విమెన్ హాస్టల్స్
➤ పరదేశిపాలెంలో రూ.70లక్షలతో కాలేజీ అమ్మాయిలకు హాస్టల్ భవనం నిర్మాణం
➤ రూ.కోటితో కేజీహెచ్ ఓపీ, క్యాజువాలటీ ఆధునీకరణ
➤ విశాఖ పోర్టులో క్రూయిజ్ టూరిజం ప్రారంభం
➤ బీచ్‌లో హోప్ ఆన్, హోప్ ఆఫ్ బస్సు సర్వీసులు

Similar News

News March 29, 2025

విశాఖలో ప్రేమ పేరుతో మోసం

image

యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. CI విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. 40వ వార్డు AKC కాలనీకి చెందిన ప్రవీణ్ అదే కాలనీలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. కాగా యువతి గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదు చేసుకున్నారు.

News March 29, 2025

విశాఖలో క్రికెట్ మ్యాచ్‌కు 50 స్పెషల్ బస్సులు

image

విశాఖలో ఆదివారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఏపీఎస్ఆర్టీసీ 30 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియానికి నడపనున్నారు. ఈ స్పెషల్ బస్సులు పాత పోస్ట్ ఆఫీస్, సింహాచలం, గాజువాక, కూర్మన్నపాలెం, వివిధ ప్రాంతాల నుంచి మధురవాడకు నడపనున్నట్లు వెల్లడించారు. రద్ధీ అనుగుణంగా బస్సులు పెంచుతామన్నారు.

News March 29, 2025

విశాఖ: ఆరు నెల‌ల్లో మెట్రో భూసేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు

image

విశాఖ‌లో చేప‌ట్ట‌నున్న మెట్రో రైలు ప్రాజెక్టు‌కు 6 నెల‌ల్లో మొద‌టి ద‌శ భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాలని అధికారుల‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అప్ర‌మ‌త్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌కు సంబంధించి కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టాల‌ని, మెట్రో ప్రాజెక్టు, మాస్ట‌ర్ ప్లాన్ రోడ్డు వేసే మార్గంలో కొత్త‌గా ఎలాంటి అనుమ‌తులు ఇవ్వకూడదని ఆదేశించారు.

error: Content is protected !!