News September 30, 2025
విశాఖ: అభివృద్ధి పనులకు ఆమోదం

విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ పీలా శ్రీనివాసరావు సోమవారం నిర్వహించారు. 91 అంశాలు అజెండాలో పొందుపరిచారు. వాటిని స్థాయీసంఘ సభ్యులు క్షుణ్ణంగా చర్చించి అన్ని అంశాలకు ఆమోదం తెలిపారు. రూ.27.60 కోట్ల అంచనా వ్యయంతో నగర సుందరీకరణ, రూ. 5.3 కోట్ల ఇతర ఇంజినీరింగ్ అభివృద్ధి పనులకు సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Similar News
News September 30, 2025
అధికారులపై విశాఖ మేయర్ ఆగ్రహం..!

నగర మేయర్ పీలా శ్రీనివాసరావు స్థాయి సంఘ సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రూ.50 కోట్లకు పైగా రోడ్ల పునరుద్ధరణ, కొత్త నిర్మాణాలు, లైటింగ్ వంటి 91 ప్రతిపాదనలు అజెండాలో పొందుపరిచారు. అయితే ఇటీవలే రోడ్లకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు గుర్తుచేసి మళ్లీ అదే పనులకు నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. పలువురు బీజేపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
News September 30, 2025
గూగుల్ డేటా సెంటర్.. నష్ట పరిహారం పెంపు: గంటా

ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన భూముల పరిహారం పెంచుతున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆర్డీవో సంగీత్ మాధుర్‌తో కలిసి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ఉన్న రూ.17 లక్షలకు అదనంగా రూ.2.55 లక్షలు పెంచుతున్నట్లు వెల్లడించారు. భూములు ఇచ్చిన రైతులకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో స్థలం, అలాగే 3 సెంట్ల ఇళ్ల స్థలం అందజేస్తామని పేర్కొన్నారు.
News September 30, 2025
విశాఖలో 28 బస్సులపై కేసు నమోదు

దసరా సందర్భంగా వివిధ రకాల ప్రైవేట్ ట్రావెల్ బస్సులను రవాణా శాఖ అధికారులు మూడు రోజులగా తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో విశాఖలో సోమవారం నాటికి నిబంధనలు ఉల్లంఘించిన 28 బస్సులపై కేసులు నమోదు చేశారు. రూ.4.82 లక్షలు ఫైన్ వేశారు. పండగల వేళ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రవాణా శాఖ నిర్దేశించిన నిబంధనలను అనుసరించి వాహనాలు నడపాలని సూచించారు.