News March 26, 2024

విశాఖ: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి

image

విశాఖలో ఆటో బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. రైల్వే స్టేషన్ వద్ద వేగంగా వెళుతున్న ఆటో బోల్తా పడడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటో వేగంగా వెళుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న నాలుగవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 7, 2025

జూ పార్కులో వివిధ రకాల జంతు, పక్షి పిల్లల జననం

image

విశాఖ జూ పార్కులో ఏడు జంతు, పక్షి పిల్లలు జన్మించాయి. చౌసింఘా, బ్లూ గోల్డ్ మకావ్, బ్లాక్ బక్ వంటి జాతులకు సంబందించిన పిల్లలు జన్మించినట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. బ్లూ గోల్డ్ మకావ్‌ను కొన్ని వారాలుగా నియంత్రిత ఇంక్యుబేషన్ సెంటర్లో ఉంచామన్నారు. వీటిని జూ వైద్య బృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారని, నూతన జంతు, పక్షి జాతులను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News September 7, 2025

విశాఖ: కొనసాగుతున్న సహాయక చర్యలు

image

ఈస్ట్ ఇండియా పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిడుగు పడిన విషయం తెలిసిందే. ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద పార్కింగ్ సమీపంలో ఉన్న ఇందనాల్ ట్యాంకర్‌ పై పిడుగు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. సంస్థలో మిగతా ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మల్కాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

News September 7, 2025

విశాఖ: కారులో మద్యం తాగి వ్యక్తి మృతి

image

కారులో మద్యం తాగుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మర్రిపాలెంలో చోటు చేసుకుంది. సుఖదేవ్ స్వైన్(53) నేవల్ డాక్ యార్డులో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం మర్రిపాలెంలో మద్యం దుకాణం వద్ద మందు కొని కారులో తాగాడు. సాయంత్రం వరకు కారు అక్కడే ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు పరిశీలించి మృతి చెందిన్నట్టు గుర్తించారు. మృతుడు ప్రస్తుతం విమాన్ నగర్‌లో ఉంటున్నాడు.