News March 29, 2025
విశాఖ: ఆరు నెలల్లో మెట్రో భూసేకరణకు చర్యలు

విశాఖలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు 6 నెలల్లో మొదటి దశ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అప్రమత్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాలని, మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసే మార్గంలో కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఆదేశించారు.
Similar News
News March 31, 2025
జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ కానున్న పవన్‌కళ్యాణ్

సీతమ్మధార జనసేన కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. క్యాంపు రాజకీయల సంస్కృతి పార్టీలో ఉండకూడదన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమని వెల్లడించారు. త్వరలో అమరావతిలో 11 మంది జనసేన కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ భేటీ ఉంటుందని ఆయన తెలిపారు.
News March 31, 2025
విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

విశాఖలో మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వేపగుంటలో ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేసి భవనాలు నిర్మించారని రేపర్తి రాజు విజ్ఞప్తి చేశారు. సుజాత నగర్ టీచర్స్ లేఅవుట్‌లో 150 గజాల స్థలాన్ని ఆక్రమించారని లక్ష్మి అనే మహిళ వినతి అందించారు.
News March 31, 2025
విశాఖలో ఐదేళ్ల బాలిక పట్ల పీటీ అసభ్యకర ప్రవర్తన

విశాఖలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధురవాడ పరిధిలో జరిగింది. వాంబే కాలనీలోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పీటీగా పనిచేస్తున్న రామచంద్రరావు ఐదేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆ చిన్నారి భయపడి తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పింది. వెంటనే వీరు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీటీని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.