News January 22, 2025
విశాఖ: ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ.2 కోట్లు
సంక్రాంతి సీజన్‌లో విశాఖ ఆర్టీసీకి రూ. రెండు కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35% అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. సంక్రాంతికి ముందు తర్వాత ఈనెల 21 వరకు విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాలకు బస్సులు నడిపినట్లు తెలిపారు. ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదన్నారు.
Similar News
News January 22, 2025
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ పి రఘువర్మ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగుస్తుంది. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. 123 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 19 వేల ఓటర్లు ఉన్నారు.
News January 22, 2025
విశాఖలో కంపెనీలు పెట్టండి: మంత్రి లోకేశ్
పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేశ్ దావోస్‌లో పర్యటిస్తున్నారు. విశాఖలో ఆటో మొబైల్ ఉత్పత్తి, సప్లయ్ చైన్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ZF ఫాక్స్‌కాన్ CEO దృష్టికి తీసుకెళ్లారు. సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్సోడస్‌ను కోరారు. గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, బ్యాక్ ఎండ్ ఐటీ ఆఫీస్ ఏర్పాటు చెయ్యాలని రాజీవ్ మోమానీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
News January 22, 2025
ఉమ్మడి విశాఖలో 29 మద్యం షాపులు కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 28 మద్యం దుకాణాలను కేటాయించింది. అనకాపల్లి జిల్లాలో గౌడ శెట్టిబలిజ యాత కులస్తులకు మొత్తం 15 దుకాణాలను కేటాయించింది. విశాఖ జిల్లాలో 14 దుకాణాలను కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఒక్క దుకాణం కూడా కేటాయించలేదు.