News January 13, 2026

విశాఖ: ఆ ప్యాసింజర్ గంటన్నర ఆలస్యం

image

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ -భవానిపట్నం ట్రైన్ నెంబర్ (58504) పాసింజర్ రైలు సమయం మార్పు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ 1:30 పాటు ఆలస్యంగా 7:30 గంటలకు బయలుదేరుతుందని ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించవలసిందిగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ట్రైన్ విజయనగరం, బొబ్బిలి , రాయగడ మీదుగా భవానిపట్నం చేరుతుంది.

Similar News

News February 16, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అనంతపురం జిల్లాలో 147 కాలేజీలుండగా 64 సెంటర్లు, 18 జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌‌లో 48,146 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఫస్టియర్‌లో జనరల్ 22,366, ఒకేషనల్ 2,202 మొత్తం 24,568 మంది, సెకండియర్‌ జనరల్ 1,965, ఒకేషనల్ 21,613 కాగా మొత్తం 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.

News February 16, 2026

కోటప్పకొండకు రికార్డు స్థాయిలో ఆదాయం

image

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా గత 5 ఏళ్ల ఆదాయ వివరాలను విడుదల చేసింది. 2022లో మొత్తం ఆదాయం రూ.1,69,07,014 కాగా, 2023లో రూ.1,73,23,449గా నమోదైంది. 2024లో రూ.1,63,48,227కు తగ్గినా 2025లో రూ.1,77,68,172కు పెరిగింది. 2026లో రికార్డు స్థాయిలో రూ.1,95,81,848 ఆదాయం లభించింది. బంగారం 3.55గ్రాములు, వెండి 278.300గ్రాములు సమర్పించబడ్డాయి.

News February 16, 2026

ఆగ్నేయ మూలలో వాస్తు దోషం ఉంటే?

image

ఆగ్నేయం దోషపూరితంగా ఉంటే కుటుంబంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘కష్టపడి సంపాదించిన ధనం వృథా అయ్యే ఛాన్సుంది. రావలసిన డబ్బు సమయానికి అందదు. ఇంట్లో మహిళలు మానసిక వేదనకు, అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కుటుంబీకుల మధ్య ఐక్యత లోపించి, నిరంతరం చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. ఈ స్థలాన్ని వినియోగించుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>