News February 12, 2026
విశాఖ: ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని CM వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.
Similar News
News February 12, 2026
మంచిర్యాల: లెక్కింపునకు ‘మూడంచెల’ కవచం

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగేలా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు క్యాతనపల్లి, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో ఫలితాల వెల్లడి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా పెట్టామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
News February 12, 2026
మంచిర్యాల: రేపటి కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు అభ్యర్థులు ఎన్నికల సిబ్బందికి సహకరించాలని సూచించారు.
News February 12, 2026
త్వరలో మొబైల్ అంగన్‌వాడీలు.. ఇంటికే సరుకులు

TG: అర్హులందరికీ అంగన్‌వాడీ సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందుకోసం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. HYD, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు. HMDA పరిధిలోని 274 బస్తీల్లో 25,310 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వీటి ద్వారా టేక్ హోం రేషన్ విధానంలో ఇళ్ల వద్దకే సరుకులు అందిస్తారు.


