News March 9, 2025

విశాఖ: ఇన్‌ఛార్జ్ మంత్రితో సమావేశమైన జిల్లా కలెక్టర్, సీపీ

image

విశాఖలో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని పోర్ట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్, విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి కలిశారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు గూర్చి మంత్రి అడిగి తెలుసుకున్నారు. P4 సర్వే సమర్థవంతంగా జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News November 11, 2025

‘విశాఖ వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి’

image

CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్ల నేపథ్యంలో విశాఖ CP కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ CP గోపినాథ్ జెట్టి సోమవారం పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. సమ్మిట్ కోసం నగరానికి రానున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖల కోసం తీసుకోవలసిన భద్రత చర్యలపై పలు సూచనలు చేశారు. నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు.ట్రాఫిక్ జామ్‌లు కాకుండా చూడాలన్నారు.

News November 11, 2025

విశాఖలో విషాద ఘటన

image

మద్యానికి బానిసైన కొడుకును కన్న తండ్రి హతమార్చిన ఘటన విశాలాక్షి నగర్లో చోటు చేసుకుంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6వ తేదీన మద్యానికి డబ్బులు కావాలని వై.ప్రసాద్ (36) తండ్రి లక్ష్మణరావును వేధించాడు. కోపోద్రిక్తుడైన తండ్రి కొడుకు తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. మృతుని భార్య రాజీ ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

News November 10, 2025

భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లు పూర్తికావాలి: కలెక్టర్

image

ఈ నెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న భాగ‌స్వామ్య స‌దస్సు ఏర్పాట్లు 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తికావాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్రసాద్ నిర్దేశించారు. క‌లెక్టరేట్లో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఎక్క‌డా ఎలాంటి స‌మ‌న్వ‌య లోపం రాకుండా అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. స‌దస్సులో ఉపరాష్ట్రప‌తి, గవ‌ర్న‌ర్, సీఎం, కేంద్రమంత్రులు భాగ‌స్వామ్యం కానున్నార‌ని సూచించారు.