News August 23, 2025
విశాఖ ఉక్కుపై సీఎం, డిప్యూటీ సీఎం నోరు మెదపడం లేదు

మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 35 భాగాలుకు ప్రైవేటు టెండర్లు పిలిచారని వెంటనే ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బలరాం డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు 2వ రోజు భీమవరం సీపీఎం ఆఫీసులో జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కాదని మేం కాపాడుతామని చెప్పిన పెద్దలు నేడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు.
Similar News
News August 23, 2025
డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన పెదఅమీరం యువకుడు

ఇటీవల విడుదలైన డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులో కాళ్ల మండలం పెదఅమీరంకు చెందిన బూరాడ వెంకటకృష్ణ ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ – మ్యాథ్స్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8వ ర్యాంక్, జోన్ 2 స్థాయి (3జిల్లాలు కలిపి) ఉద్యోగాలైన టీజీటీ మ్యాథ్స్‌లో 6వ ర్యాంక్, పీజీటీ మ్యాథ్స్‌లో 24వ ర్యాంక్, రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ పోస్ట్‌కు గాను 56వ ర్యాంక్ సాధించాడు.
News August 23, 2025
ఈనెల 25న డీఎస్సీ అభ్యర్థుల వెరిఫికేషన్: DEO

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25న ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, మూడు గెజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాలి. ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లను https:/apdsc.apcfss.in అప్లోడ్ చేయాలన్నారు
News August 23, 2025
జిల్లాలో ఎరువులకు కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడినంత స్టాకు సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖామంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఎరువుల పరిస్థితి, పంటల స్థితిగతులను వారికి కలెక్టర్ వివరించారు.