News September 21, 2024

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరట

image

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఊరట లభించింది. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న దీనికి మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అప్పగించింది.

Similar News

News January 8, 2026

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ఘన స్వాగతం

image

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి విశాఖలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.

News January 8, 2026

విశాఖలో రేపు డీఆర్సీ సమావేశం

image

విశాఖలో డీఆర్సీని జనవరి 9న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఇన్‌ఛార్జ్‌ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ సమీక్షలో పాల్గొననున్నారు. పక్కా నివేదికలతో అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలన్నారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా ఉండాలని సూచించారు.

News January 8, 2026

విశాఖ మీదుగా వెళ్లే ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’ రీషెడ్యూల్

image

కన్యాకుమారి – దిబ్రూగఢ్ వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22503) నేడు (08.01.2026) రీషెడ్యూల్ చేయబడింది. సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 9 గంటలకు బయలుదేరుతోంది. దీనివల్ల రేపు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ రైలు సుమారు 4 గంటల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.