News April 5, 2025

విశాఖ: ఉరేసుకుని విశ్రాంత ఉద్యోగి మృతి

image

విశాఖలోని లాసన్స్‌బే కాలనీలో విశ్రాంత ఉద్యోగి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలనీకి చెందిన డానియల్ మిల్టన్(64) ఏలూరు జిల్లా కోపరేటివ్ బ్యాంకులో జాయింట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించి, జూన్ 2024లో పదవీ విరమణ పొందారు. అనంతరం మిల్టన్‌కు అందాల్సిన ప్రయోజనాలు అందలేదని, మనస్తాపానికి గురై ఉరేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 5, 2025

మహిళా కాలేజి వసతి గృహంలో భోజనం చేసిన జిల్లా కలెక్టర్

image

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా విశాఖ ప్రభుత్వ మహిళా కాలేజీ వసతి గృహంలో శనివారం జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ఎం.ఎన్ హ‌రేంధిర ప్ర‌సాద్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన చేతుల మీదగా కేక్ కట్ చేశారు. అనంతరం వసతి గృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతిగృహంలో ఉన్న వసతుల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.

News April 5, 2025

విశాఖ: తండ్రి బైకు కొని ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య

image

తండ్రి బైకు కొని ఇవ్వలేదని కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ నగరంలో వెలుగు చూసింది. రామా టాకీస్ ప్రాంతంలో నివాసముంటున్న కార్తీక్ తండ్రి వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడు. కార్తీక్ కొద్దిరోజులుగా బైక్ కోసం తండ్రితో గొడవ పడేవాడు. బైకు కొనకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ద్వారక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2025

విశాఖ తీరంలో అమెరికా యుద్ధ విన్యాసాలు

image

విశాఖ తీరానికి సైనికులతో ఉన్న అమెరికా దేశ యుద్ధ నౌకలు వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతకు దిక్సూచిగా భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 విన్యాసాల్లో పాల్గొనడానికి విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ వరకు హార్బర్ ఫేజ్‌లో విన్యాసాలు జరుగుతాయి. అమెరికా యుద్ధనౌక యూఎస్ కంస్టాక్, రాల్స్ జాన్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

error: Content is protected !!