News May 1, 2024

విశాఖ ఎంపీ స్థానానికి మూడు ఈవీఎంలు

image

విశాఖ లోక్‌సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. 39 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురివి తిరస్కరణకు గురయ్యాయి. 33 మంది మిగలగా, ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. నోటాతో కలిపితే 34 మందితో బ్యాలెట్ పేపరు రానుంది. ఒక బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)లో 16 పేర్లకు మాత్రమే అవకాశం ఉంది. ఈ లెక్కన 34 పేర్లకు 3 ఈవీఎంలు వినియోగించాల్సి ఉంది.

Similar News

News August 5, 2025

విశాఖ: రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రౌండ్ సర్కిల్ వద్ద రోడ్డుపై నడుస్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 4, 2025

నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పిల్ల‌ల‌ ద‌త్త‌త: కలెక్టర్

image

కేంద్ర ప్ర‌భుత్వం నూత‌నంగా రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం పిల్ల‌ల ద‌త్త‌త ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ద‌త్త‌త తీసుకోవాల‌నుకునే వారు పాన్ కార్డు, ఆదాయ, వ‌య‌స్సు, నివాస‌, వివాహ‌, ఆరోగ్య‌ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలన్నారు. ద‌త్త‌త తీసుకోవాల‌నుకునే వారు ICDS అధికారుల‌ను గానీ wws.cara.wcd.gov.in వెబ్ సైట్‌ను సంప్ర‌దించచాలన్నారు.

News August 4, 2025

దువ్వాడ: బిచ్చగాడిని హత్య చేసిన కేసులో నిందితుడి అరెస్టు

image

దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిడ్జి వద్ద గత నెల 31న బిచ్చగాడు మనోజ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనలో దేవరాజ్ అనే వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. 31న రాత్రి బిచ్చగాడు మనోజ్, దేవరాజ్ కలిసి మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మనోజ్‌ను చంపేసి దేవరాజ్ పరారయ్యాడు. దువ్వాడ పోలీసులు గాలించి నిందితుడ్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.