News November 10, 2025
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు.
Similar News
News November 10, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు పూర్తికావాలి: కలెక్టర్

ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తికావాలని అధికారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిర్దేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి సమన్వయ లోపం రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సదస్సులో ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు భాగస్వామ్యం కానున్నారని సూచించారు.
News November 10, 2025
మెదక్: ఆర్మీకి ఆర్ధికంగా సహకరిద్దాం: అదనపు కలెక్టర్

ఆర్మీకి సహాయ సహకారాలు, ఆర్ధికంగా సహకరిద్దామని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ వారోత్సవాల్లో భాగంగా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. ఆవిష్కరించిన స్టిక్కర్స్‌ను పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు విక్రయించగా వచ్చే డబ్బులను ఆర్మీ, సహాయ సహకారాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
News November 10, 2025
గోపాలపట్నంలో వివాహిత అనుమానాస్పద మృతి

గోపాలపట్నం సమీపంలో రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న శ్యామల అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పది నెలల క్రితం వేపాడ దిలీప్ శివ కుమార్‌తో వివాహం కాగా తల్లిదండ్రులు భారీగానే ఇచ్చారు. సోమవారం శ్యామల చనిపోయినట్లు సమాచారం అందడంతో తల్లి వచ్చి చూసి ముఖం పైన బలమైన గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని అల్లుడు, బంధువులే చంపేశారని ఫిర్యాదు చేశారు. మృతురాలి శ్యామల నేవిలో ఉద్యోగం చేస్తోంది.


