News March 27, 2024
విశాఖ: ఎన్నికల ఏర్పాట్లపై ప్రధాన అధికారి సమీక్ష

విజయవాడ నుంచి ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సి విజిల్ ఫిర్యాదులు పరిష్కారం ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ తదితరులు ఎన్నికల నిర్వహణపై వివరించారు.
Similar News
News March 18, 2025
దాకమర్రి లేఅవుట్ ధర తగ్గింపు: VMRDA ఎంసీ

విజయనగరానికి దగ్గరలో దాకమర్రి లే అవుట్‌లో స్థలాల ధరలను గజం రూ.20వేల నుంచి రూ.15,500 తగ్గించినట్టు VMRDA ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. నివాస స్థలాలు ధరలు ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం ప్రభుత్వం ధరలను తగ్గించిందని చెప్పారు. ఈ లేఅవుట్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
News March 18, 2025
టైమ్ బ్యాంక్ కాన్సెప్ట్‌తో ఒంటరితనం దూరం: కలెక్టర్

టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా వయోవృద్ధులకు ఒంటరితనం పోతుందని, అవసరమైన సమయంలో తోడు దొరుకుతుందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం టైమ్ బ్యాంక్ నిర్వహించిన సెమినార్లో కలెక్టర్ మాట్లాడారు. వయోవృద్ధులకు టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయకులు అండగా నిలుస్తారన్నారు. వయో వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విభిన్న రీతిలో కృషి చేస్తోందన్నారు.
News March 18, 2025
విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.