News April 28, 2024
విశాఖ: ఎన్నికల బరిలో నిలిచే వారెవరో.. తేలేది రేపు
సార్వత్రిక ఎన్నికల పోటీలో నిలిచే వారి సంఖ్య రేపు స్పష్టం కానుంది. శనివారం నాడు ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువుంది. ఈరోజు సెలవు కావడంతో సోమవారం పలువురు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. లోక్ సభకు 33 మంది, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది నామ పత్రాలు దాఖలు చేశారు. వీరిలో ఎంతమంది ఉంటారనేది సోమవారం తేలనుంది.
Similar News
News January 3, 2025
జనవరి 4న విశాఖకు సీఎం.. షెడ్యూల్ ఇదే
విశాఖలో జనవరి 4న జరగనున్న నేవీ విన్యాసాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. శనివారం మధ్యాహ్నం 3:40కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆర్‌కె బీచ్‌కు వెళ్లి నేవీ విన్యాసాలు తిలకిస్తారు. 6:15 నిముషాలకు ఆర్‌కె బీచ్ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రోడ్డు మార్గన వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు.
News January 3, 2025
ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 8న అచ్చుతాపురం, నక్కపల్లిలో పలు పరిశ్రమలను విశాఖ నుంచి ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాప చేస్తారని వెల్లడించారు. అనంతరం ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.
News January 3, 2025
కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్‌కు 228 మంది హాజరు
పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ కైలాసగిరి వద్ద పోలీస్ మైదానంలో గురువారం ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొని పర్యవేక్షించారు. 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు, ఛాతీ పరీక్షలు నిర్వహించారు. 600 మంది అభ్యర్థులకు గాను 228 మంది హజరయ్యారని ఎస్పీ తెలిపారు.