News April 15, 2024

విశాఖ: ఎన్నికల వ్యయం లెక్కలు పక్కాగా రాయాలి

image

ఎన్నికల వ్యయానికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు పక్కా రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఆర్.వో., జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు. నామినేషన్లు వేసిన రోజు నుంచి అభ్యర్థుల ఖాతాల్లో వ్యయానికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తామని వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

Similar News

News October 7, 2025

వాల్మీకి జీవిత విశేషాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాలి: కలెక్టర్

image

మ‌హ‌ర్షి వాల్మీకి జీవిత విశేషాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అన్నారు. వాల్మీకి జ‌యంతిని పుర‌స్క‌రించుకొని విశాఖ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో కలెక్టరేట్‌లో వాల్మీకి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. మాన‌వ జీవితానికి అనువైన విధంగా వాల్మీకి రామాయణాన్ని ర‌చించి ఎన్నో విష‌యాల‌పై మ‌హత్త‌ర సందేశాన్ని అందించార‌ని గుర్తు చేశారు.

News October 7, 2025

విశాఖలో ప్రారంభమైన రక్త మార్పిడి సేవలపై జాతీయ వర్క్‌షాప్

image

ఏపీ రక్త మార్పిడి సేవల విభాగం, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో “రక్తం,రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం” అంశంపై రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ విశాఖలో మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జెనరల్ డా.సునీత శర్మ, NBTC డైరెక్టర్ డా.కృష్ణ కుమార్, WHO ప్రతినిధి డా.మాధుర్ గుప్తా పాల్గొన్నారు.

News October 7, 2025

రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో నారా లోకేష్ భేటీ

image

రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహా నగరంలో లగ్జరీ టౌన్ షిప్ నిర్మాణం చేపట్టాలని మంత్రి లోకేష్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బాగస్వామ్యం అవ్వాలని కోరారు.