News April 20, 2024

విశాఖ: ‘ఎన్నికల వ్యయాలను ఖచ్చితంగా లెక్కించాలి’

image

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాల వివరాలను ఖచ్చితంగా లెక్కించాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల వ్యయ పరిశీలకులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. అభ్యర్ధులు ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎన్నికల వ్యయంలోకే వస్తుందని, అందువలన వాటిపై ఏఈఓలకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు.

Similar News

News October 10, 2025

విశాఖ: రైతు బజార్లలో స్టాల్‌లకు నోటిఫికేషన్ విడుదల

image

ఆరిలోవ రైతు బజార్‌లో మొత్తం 11 స్టాళ్లను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డ్వాక్రా మహిళలకు 10, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్‌కి ఒకటి కేటాయించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 20వ తేదీ లోపు గోపాలపట్నంలో గల మార్కెటింగ్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News October 9, 2025

విశాఖ: ‘డ్వాక్రా మహిళలకు ఈనెల 26 వరకు వైద్య పరీక్షలు’

image

డ్వాక్రా మహిళలకు సఖి సురక్ష కార్యక్రమం కింద ఈనెల 26 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 35 ఏళ్లు దాటిన మహిళలకు వైద్య పరీక్షలు చేస్తామన్నారు. వైద్య పరీక్షల్లో వ్యాదిని గుర్తించి చికిత్స అందిస్తామని మెప్మా డైరెక్టర్ తేజ భరత్ పేర్కొన్నారు.

News October 9, 2025

VMRDA కమిషనర్ కే.ఎస్.విశ్వనాథన్ బదిలీ

image

VMRDA కమిషనర్ కే.ఎస్.విశ్వనాథన్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు. VMRDA కమిషనర్‌గా విశ్వనాథన్ పలు సంస్కరణలను చేపట్టారు. VMRDA పరిధిలో ఉన్న టూరిజం, కళ్యాణమండపాలను అభివృద్ధి దిశగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించారు.