News November 11, 2024

విశాఖ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?

image

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి విశాఖ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, స్టీల్ ప్లాంట్ సమస్య, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

Similar News

News November 13, 2024

విశాఖలో నకిలీ పోలీస్ హల్ చల్

image

పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీసు అవతారమెత్తిన వంతల సంతోష్(32)ని స్థానిక క్రైమ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైవేపై వంతెన వద్ద పోలీస్ యూనిఫామ్ ధరించి ఫోన్ అమ్మేందుకు యత్నింస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా.. పాడేరుకు చెందిన సంతోఫ్‌పై ఇదివరకే ఆరిలోవ స్టేషన్లో 2 కేసులు ఉన్నట్లు తెలిపారు.

News November 13, 2024

‘విశాఖకు మెట్రో అవసరం ఉంది’

image

విశాఖ మెట్రోపై ఉమ్మడి జిల్లా MLAలు అసెంబ్లీలో మాట్లాడారు. విశాఖలో జనాభా పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని మెట్రో పూర్తయితేనే ఈ కష్టాలు తీరుతాయని గాజువాక MLA పల్లా పేర్కొన్నారు. అనకాపల్లి వరకు మెట్రో ప్లాన్ పొడిగించాల్సని అవసరం ఉందని MLA కొణతాల కోరారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తవుతున్న క్రమంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా మెట్రో పూర్తిచేయాలని MLA గణబాబు అన్నారు.

News November 13, 2024

విశాఖలో డ్రగ్స్ కంటైనర్స్‌పై మరోసారి చర్చ

image

విశాఖలో డ్రగ్స్‌ కంటైనర్‌ను CBI సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై MLC బొత్స కేంద్ర హోంమంత్రికి మంగళవారం లేఖ రాశారు. ‘సంధ్యా ఆక్వా సంస్థ పేరు మీద బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్‌‌ను CBI సీజ్ చేసింది. ఆక్వా యాజమాన్యానికి పురందీశ్వరికి సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. దర్యాప్తు వివరాలు బహిర్గతం కాలేదు. వాస్తవాలను పబ్లిక్ డొమైన్‌లో వెల్లడించాలని CBIకి ఆదేశాలు జారీ చేయండి’ అని పేర్కొన్నారు.