News February 20, 2025

విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై కలెక్టర్ సమీక్షా

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్షా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏజెంట్‌లు, ఎన్నికల విధులు సన్నద్ధతపై ఉత్తరాంధ్ర జిల్లాల ఏఆర్వోలకు సూచనలు చేశారు. ఎన్నిక‌లకు సంబంధించిన‌ విధుల‌ నిర్వహ‌ణ‌లో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆదేశించారు.

Similar News

News December 24, 2025

విశాఖ: ‘పబ్‌లు, వైన్ షాప్‌ల నిబంధనలు మేరకు వ్యవహరించాలి’

image

విశాఖలో పబ్బులు, వైన్ షాపుల వద్ద ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయని సీపీ శంఖబ్రత బాగ్చి పోలీస్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పరిమితికి మించి మనుషులను అనుమతించడం, అధిక శబ్దంతో వాహనాలు నడపడం, సమయం దాటి షాపులు నిర్వహించడం వంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కస్టమర్ల భద్రతకు ముప్పు కలగకుండా పబ్, వైన్ షాప్ బయట సీఐ, సీపీ నంబర్లు ప్రదర్శించాలన్నారు.

News December 24, 2025

విశాఖ: రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బుధవారం పరిహారం అందజేశారు. చిలకపల్లి రమేష్ హిట్‌ అండ్‌ రన్‌లో మరణించగా.. ఆయన భార్య చిలకపల్లి నీలమణి అకౌంట్‌లో రూ.2 లక్షలు జమ చేశామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హిట్ అండ్ రన్‌‌ కేసుల్లో 102 మంది బాధితులకు మొత్తం రూ.84లక్షలు అందించినట్లు చెప్పారు.

News December 24, 2025

విశాఖలో ఆర్టీసీ సేవలపై అవగాహన సదస్సు

image

జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఓ కాలేజీలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రయాణికుల అభిప్రాయ సేకరణ కోసం ద్వారకా, మద్దిలపాలెం వంటి ప్రధాన బస్టాండ్లలో ‘డిజిటల్ ఫీడ్ బ్యాక్ స్కానర్లు’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాట్సాప్ (95523 00009) ద్వారా రిజర్వేషన్ సేవలు, శ్రీశక్తి భద్రత కోసం 149 టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని కోరారు.