News February 7, 2025

విశాఖ: ఎమ్మెల్సీ స్థానానికి మరో మూడు నామినేషన్లు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం మూడు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు సంబంధిత పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు చేశారు. వారిలో నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.

Similar News

News December 29, 2025

ధనుర్మాసం: పద్నాలుగో రోజు కీర్తన

image

‘సఖీ! అందరినీ లేపుతానన్న వాగ్దానం మరిచి నిద్రిస్తున్నావా? తెల్లవారింది, కలువలు విచ్చుకున్నాయి. మునులు, యోగులు గుడి తలుపులు తీసేందుకు తాళాలతో వెళ్తున్నారు. ఇవన్నీ ఉదయానికి సూచనలే కదా! పంకజాక్షుడైన ఆ కృష్ణుని శంఖచక్రాల సౌందర్యాన్ని, ఆయన గుణగణాలను మనమంతా కలిసి కీర్తించాలి. నీవు వెంటనే మేలుకో, గోష్టిగా సంకీర్తన చేస్తేనే మన వ్రతం ఫలిస్తుంది” అంటూ గోదాదేవి తొమ్మిదవ గోపికను మేల్కొలుపుతోంది. <<-se>>#Dhanurmasam<<>>

News December 29, 2025

ఇండియా ‘విశ్వ గురువు’ కావాలి: RSS చీఫ్

image

ప్రపంచ సంక్షేమం కోసం హిందువులు భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని అన్నారు. ‘ప్రపంచం మన వైపు చూస్తోంది. భారత్ విశ్వ గురువు కావడం మన ఆశయం కాదు.. ప్రపంచానికి అవసరం. ఇందుకు చాలా కష్టపడి పని చేయాలి’ అని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన విశ్వ సంఘ్ శిబిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

News December 29, 2025

శ్రీ సత్యసాయి: ఎన్నికలు ఏకగ్రీవం

image

శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా శాఖా ఎన్నికలు కలెక్టరేట్‌లో ఆదివారం జరిగినట్లు ఎన్నికల అధికారి దివాకర్ రావు వెల్లడించారు. హిందూపురం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయ డీటీ గిరిధర్‌ అసోసియేట్ అధ్యక్షుడిగా, పుట్టపర్తి డీటీ కళ్యాణ చక్రవర్తి కార్యదర్శిగా, సోమందేపల్లి డీటీ శ్రీకాంత్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.