News November 13, 2025
విశాఖ: ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం

విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.82వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ పవర్ సంస్థ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకుంది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రెన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ఉద్యోగాలకు అవకాశం లభించనుంది.
Similar News
News November 13, 2025
మిథున్ రెడ్డికి జనసేన కౌంటర్

మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో బుకాయిస్తే ఆయన తండ్రి <<18276752>>ఆక్రమణలు <<>>సక్రమం కావని జనసేన పేర్కొంది. ‘1968 సెప్టెంబర్ 16న మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76ఎకరాలున్న భూమి 103ఎకరాల 98సెంట్లు ఎలా అయ్యిందో చెబుతారా మిథున్ రెడ్డి. అడవిని ఎలా కబ్జా చేశారో మీ తండ్రిని అడగండి. 32ఎకరాల 63సెంట్లు అడవిని కబ్జా చేసేసినంత ఈజీ కాదు చట్టం నుంచి తప్పించుకోవడం. కాసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది’ అని ట్వీట్ చేసింది
News November 13, 2025
ఉంగుటూరు: ‘రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతివ్వాలి’

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం కలెక్టర్ కె.వెట్రి సెల్విని, అటవీ శాఖ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దశబ్దాలుగా కొల్లేరులో వ్యవసాయం చేసుకొని జీవనోపాధి సాగిస్తున్న రైతులను కొల్లేరులో వ్యవసాయం చెయ్యటానికి వీలు లేదన్నారు. గత కొన్ని రోజులుగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవటంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
News November 13, 2025
GNT: దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు నెలల్లో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం విడుదల చేశారు. ఎంఏ సంస్కృతం, ఎంఏ పొలిటికల్ సైన్స్ మొదటి, ద్వితీయ, తృతీయ, నాలుగవ సెమిస్టర్, ఎమ్మెస్సీ జువాలజీ, బోటనీ, మైక్రో బయాలజీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్‌కు ఈ నెల 29లోగా అందజేయాలన్నారు.


