News May 26, 2024
విశాఖ: ఏయూ డిగ్రీ ఫలితాలు విడుదల
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు చెందిన ఆరో సెమిస్టర్ ఫలితాలు వెలువడ్డాయి. 27,603 మంది విద్యార్థులు ఆరో సెమిస్టర్‌కు హాజరు కాగా 27,483 మంది ఉత్తీర్ణులైనట్లు ఏయూ డిగ్రీ కళాశాల ఎగ్జామినేషన్ డీన్ ఆచార్య డీవీఆర్ మూర్తి తెలిపారు. 99.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏయూ వెబ్ సైట్‌లో ఉన్నాయని వెల్లడించారు.
Similar News
News January 22, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు భార్యాభర్తలని పోలీసులు తెలిపారు. ఫార్మాసిటీలో విధులు నిర్వహిస్తున్న మన్మధరావు తన భార్య అరుణ్ కుమారీతో కలిసి అగనంపూడి వద్ద డొంకాడ గ్రామంలో అద్దెకు ఉంటున్నట్లు సీఐ వివరాలు వెల్లడించారు. బ్యాంకు పనినిమిత్తం బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని సీఐ తెలిపారు.
News January 22, 2025
అల్లూరి: బడి కోసం ఊరంతా ఏకమైంది..!
చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరంలో పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో పాఠశాల భవనం లేక బడి ఈడు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామస్థులంతా ఏకమై శ్రమదానంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.
News January 22, 2025
అగనంపూడి వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
అగనంపూడి టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గాజువాక నుంచి అగనంపూడి వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు లారీ వెనుక చక్రాల కింద పడి స్పాట్‌లోనే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక మహిళ, మరో పురుషుడు ఉన్నారు. మృతి చెందిన మహిళ వద్ద ఉన్న ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ప్రకారం పాత గాజువాకకు చెందిన గొర్లె అరుణ్ కుమారిగా పోలీసులు గుర్తించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.