News October 9, 2024
విశాఖ: ఒక్కరే 30మద్యం దుకాణాలకు దరఖాస్తు

విశాఖ జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తూ.. ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ మద్యం వ్యాపారి ఏకంగా 30దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కొందరు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తులు ఎక్కువగా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News July 4, 2025
విశాఖ: ఈ ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణం

విశాఖలోని 3 ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్లను V.M.R.D.A. నిర్మించనుంది. మిథిలాపురి వుడా కాలనీ, మారికవలస, వేపగుంటల్లో మధ్యతరగతి కుటుంబాల కోసం 2BHK, 2.5 BHK, 3 BHK అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. PPP పద్ధతిలో నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణానికి గతంలో డిమాండ్ సర్వే నిర్వహించారు. ఆదరణ లభించడంతో వీటి నిర్మాణానికి నిర్ణయించారు.
News July 4, 2025
లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కలెక్టర్

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.
News July 4, 2025
విశాఖలో ఏడో తరగతి బాలికపై అత్యాచార యత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ట్రీ టౌన్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.