News August 22, 2024

విశాఖ: ఒక్కొక్కరికి 1.02 కోట్ల పరిహారం

image

అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంలో 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దేశ ప్రధాని మోదీ సైతం స్పందించారు. మృతిచెందిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ ప్రకటించారు. మరోవైపు విశాఖ కలెక్టర్ మృతులకు రూ.కోటి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.1.02 కోట్లు అందనుంది.

Similar News

News January 20, 2025

విశాఖ: రాత పరీక్షకు 272 మంది ఎంపిక 

image

కైలాసగిరి మైదానంలో APSLRB ఆధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులకు గానూ 361మంది హాజరయ్యారని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. వీరిలో 272 మంది అభ్యర్థులు తదుపరి జరగనున్న రాత పరీక్షకు ఎంపికయినట్లు వెల్లడించారు. నియామక ప్రక్రియ ప్రణాళిక బద్దంగా జరుగుతుందన్నారు.

News January 20, 2025

ఆనందపురం: లంకె బిందెల పేరుతో రూ.28 లక్షలు స్వాహా

image

ఆనందపురం మండలం బీపీ కళ్లాలకు చెందిన నలుగురు వద్ద నుంచి లంకె బిందెలు పేరుతో ముగ్గురు వ్యక్తులు రూ.28 లక్షలు కాజేశారు. దీనిపై ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. తన దగ్గర బంగారు నిధి ఉందని పూజలు చేయడానికి రూ.30 లక్షలు అవుతుందని నకిలీ స్వామీజీ నమ్మించాడు. బాధితులు దఫదఫాలుగా నిందితులకు రూ.28 లక్షలు ఇచ్చారు. ఈనెల 2న బాధితులకు రెండు బిందెలు ఇచ్చి వారు వెళ్లిపోయారు. తర్వాత చూడగా వాటిలో ఏమి లేవు.

News January 20, 2025

ఎండాడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

ఎండాడ సాయిరాం పనోరమ హిల్స్ వద్ద నూతనంగా నిర్మాణంలో ఉన్న భవంతులలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అనారోగ్యంగా ఉండి మద్యం తాగి మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.