News September 10, 2024

విశాఖ: ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12న జాబ్ మేళా

image

విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ చేసినవారు అర్హులు. అశోక్ లేలాండ్ కంపెనీలో ఖాళీలు భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సెలక్ట్ అయిన వారికి దుబాయ్‌లో ఉద్యోగావకాశం అని పేర్కొన్నారు. వివరాలకు 9440197068 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

Similar News

News September 21, 2025

విశాఖ ఈ-గవర్నెన్స్ సదస్సుకు కేంద్ర సహాయ మంత్రి

image

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. ‌మధ్యాహ్నం 2.05కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుండి నగరంలోని ప్రైవేట్ హోటల్‌కి చేరుకుని 3 నుంచి 4.30 వరకు 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకు హాజరవుతారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఈ సదస్సుకి సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు.

News September 21, 2025

విశాఖలో రేపు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

ప్రతి సోమవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్‌ను సెప్టెంబర్ 22న రద్దు చేశారు. విశాఖలో సెప్టెంబరు 22, 23వ తేదీలలో జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు నిర్వహించనున్నారని, ఈ సదస్సులో అధికారులు పాల్గొనవలసి ఉంటుందని కలెక్టర్ హరేంద్రప్రసాద్ తెలిపారు. దీంతో పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 21, 2025

ఈ-గ‌వ‌ర‌న్నెన్స్ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయాలి: కలెక్టర్

image

విశాఖలో సెప్టెంబర్ 22, 23 తేదీలలో జరగనున్న 28వ జాతీయ ఈ-గ‌వ‌ర‌న్నెన్స్ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయాలని జాయింట్ సెక్ర‌ట‌రీ స‌రితా చౌహాన్, రాష్ట్ర ఐటీ సెక్ర‌ట‌రీ కాట‌మ‌నేని భాస్క‌ర్ నిర్దేశించారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి స‌మీక్షా నిర్వ‌హించారు. ఎక్క‌డా ఎలాంటి లోపాలు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌న్నారు.