News January 31, 2025
విశాఖ: కన్న కొడుకే హత్య చేశాడు

విశాఖలో శుక్రవారం తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. <<15316724>>ఆల్కాసింగ్<<>> భర్త బదిలీ కావడంతో ఇటీవలే ముంబాయి నుంచి విశాఖ వచ్చారు. పెద్ద కొడుకు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని మందలించింది. దీంతో తల్లిని తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మల్కాపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News February 28, 2026
విశాఖ: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీ

విశాఖ కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు సందర్శిచారు. ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్లు-2026 అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గవర్నర్ ఆమోదం వెంటనే చట్టమవుతుందని తెలిపారు. జైళ్ల అభివృద్ధికి రూ.102 కోట్లు కేటాయించి, తొలి విడతగా రూ.53 కోట్లతో బ్యారక్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు రోజుల శిక్షణ ముగింపులో అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు.
News February 27, 2026
హోలీ పండుగ రద్దీ దృష్ట్యా విశాఖ- పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం – పాట్నా మధ్య రెండు ప్రత్యేక రైళ్లను (08537/08538) నడపాలని వాల్తేరు రైల్వే విభాగం నిర్ణయించింది. మార్చి 1, 8 తేదీల్లో విశాఖ నుంచి, మార్చి 2, 9 తేదీల్లో పాట్నా నుంచి ఈ రైళ్లు బయలుదేరుతాయి. విజయనగరం, బొబ్బిలి, రాయగడ మీదుగా నడిచే ఈ రైలు సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.
News February 27, 2026
విశాఖ: రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి

విశాఖ రైల్వే స్టేషన్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు జిల్లా కోర్టులో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు సిబ్బంది మృతితో తోటి ఉద్యోగుల్లో విషాదం నెలకొంది.


