News April 21, 2024
విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

అచ్చుతాపురం మండలంలో కరెంట్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. రామన్నపాలెంకి చెందిన ధర్మిరెడ్డి శ్రీను (42) తన ఇంటి ముందు ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌లో విద్యుత్ వైర్లు తగిలించే క్రమంలో కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బుచ్చిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 11, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

పూండి రైల్వే స్టేషన్‌లో ఇంటర్ లాకింగ్ సిస్టం పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం పవన్ శుక్రవారం తెలిపారు. విశాఖ – బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18526), విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (22820), విశాఖ – బరంపూర్ ప్యాసింజర్ (58532ను) అక్టోబర్ 13న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో ఇవే రైళ్లు అక్టోబర్ 14న రద్దు చేసినట్లు వెల్లడించారు.
News October 10, 2025
విశాఖ: ‘ధాన్యం సేకరణపై అప్రమత్తంగా ఉండాలి’

ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. విశాఖ జిల్లాలో 40 రైతు సేవా కేంద్రాల ద్వారా 10,000 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. కామన్ రకం క్వింటాకు రూ.2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధరగా నిర్ణయించారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 1967కి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
News October 10, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ కంచరపాలెం దొంగతనం కేసును చేధించిన పోలీసులు
➤ విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు
➤ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 20 దరఖాస్తులు
➤ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ నేతలు
➤ VMRDA గార్డెన్ కార్మికులను విధులలోకి తీసుకోవాలి: CITU
➤ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కావడం లేదు: MLA వంశీ కృష్ణ
➤ సింహాచలంలో అమ్మవారి బేడా తిరువీధి మహోత్సవం
➤ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంనకు 15 వినతులు