News December 19, 2024

విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ప్రసాద్ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ప్రజలు 0891-2590102కు ఫోన్ చేయాలని సూచించారు.

Similar News

News July 6, 2025

సింహాచలం గిరిప్రదక్షిణ: పార్కింగ్ స్థలాలు ఇవే-1

image

తొలి పావంచా వద్దకు వచ్చే వారి వాహనాలు అడవివరం జంక్షన్, సింహపురి కాలనీ RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో పార్కింగ్ చెయ్యాలి. హనుమంతవాక వైపు నుంచి వచ్చే భక్తులు ఆదర్శనగర్, డైరీ ఫారం జంక్షన్, టి.ఐ.సి పాయింట్, ఆరిలోవ లాస్ట్ బస్సు స్టాప్ మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డంపింగ్ యార్డ్ జంక్షన్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి అనంతరం దేవస్థానం ఉచిత బస్సుల్లో అడవివరం న్యూ టోల్గేట్ వద్దకు చేరుకోవాలి.

News July 6, 2025

కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం: కె.కె రాజు

image

వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో గాజువాక జగ్గు జంక్షన్ వద్ద ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ పేరుతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పథకాలు అమలులో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News July 6, 2025

‘విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో కొత్త బ్యారక్’

image

ఏపీలో ఉన్న వివిధ జైళ్లను రూ.103 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జైళ్ల శాఖ ఐజీ డా.ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్‌ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రూ.10 కోట్లతో 250 మంది సామర్థ్యం గల కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ జైలుని సందర్శించిన ఆయన ఈ మేరకు వివరాలు తెలియజేశారు.