News September 29, 2025
విశాఖ కలెక్టర్ గ్రీవెన్స్ డేకు 365 వినతులు

గ్రీవెన్స్ డేలో వచ్చిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 365 అర్జీలు అందాయి. రెవెన్యూ విభాగానికి చెందినవి 121, జీవీఎంసీ 124, పోలీస్ శాఖవి 26 ఉండగా, 94 ఇతర అంశాలకు సంబంధించినవి. ఫిర్యాదుదారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News September 30, 2025
విశాఖలో 28 బస్సులపై కేసు నమోదు

దసరా సందర్భంగా వివిధ రకాల ప్రైవేట్ ట్రావెల్ బస్సులను రవాణా శాఖ అధికారులు మూడు రోజులగా తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో విశాఖలో సోమవారం నాటికి నిబంధనలు ఉల్లంఘించిన 28 బస్సులపై కేసులు నమోదు చేశారు. రూ.4.82 లక్షలు ఫైన్ వేశారు. పండగల వేళ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రవాణా శాఖ నిర్దేశించిన నిబంధనలను అనుసరించి వాహనాలు నడపాలని సూచించారు.
News September 30, 2025
సీతమ్మధారలో స్పా సెంటర్లపై దాడి

విశాఖ నగరంలోని సీతమ్మధార వద్ద సాయి స్టార్ సెలూన్ మసాజ్ స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై భరత్ కుమార్ రాజు తన సిబ్బందితో తనిఖీలు చేశారు. ఓ విటుడు, ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకుని ఎంవీపీ పోలీసులకు అప్పగించారు.
News September 29, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 80 ఫిర్యాదులు

విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు 80 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.