News August 25, 2025
విశాఖ కలెక్టర్ పీజీఆర్ఎస్‌కు 329 వినతులు

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 329 వినతులు అందాయి. కలెక్టర్ హరేందర్ ప్రసాద్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 141, జీవీఎంసీకి చెందినవి 72, పోలీస్ శాఖకు సంబంధించినవి 17 ఉండగా ఇతర శాఖలకు చెందినవి 99 ఫిర్యాదులు వచ్చాయి.
Similar News
News August 26, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 110 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 110 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News August 25, 2025
విశాఖ పోర్టు రోడ్డులో భారీ వాహనాలకు అనుమతి లేదు

కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. మ.12.30 నిమిషాలకు I.N.S సర్కార్‌కు చేరుకొని ఉదయగిరి, హిమగిరి అనే నౌకలను ప్రారంభించనున్నారు. ఆయన ప్రసంగించిన తర్వాత సాయంత్రం 5.25 నిముషాలకు తిరిగి బయలుదేరుతారు. V.V.I.P రాక సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ రోడ్డులో రేపు భారీ వాహనాలకు అనుమతి లేదని పోర్టు అధికారులు తెలిపారు.
News August 25, 2025
విశాఖ జిల్లాలో 5,616 స్మార్ట్ కార్డులు పంపిణీ: జేసీ

జిల్లాలో సోమవారం 5,616 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. ఈనెల 31 వరకు సచివాలయాల సిబ్బంది ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు సంబంధిత రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. పాత బియ్యం కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరుతో సచివాలయ సిబ్బంది నుంచి స్మార్ట్ కార్డులు తీసుకోవాలన్నారు.