News August 20, 2025

విశాఖ: కానిస్టేబుల్‌గా ఎంపికైన వారికి అలెర్ట్

image

సివిల్, ఏపీఎస్సీ ఉద్యోగాలకు విశాఖలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు ఈనెల 22వ తేదీన కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో హాజరుకావాలని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన మూడు సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకురావాలన్నారు. అలాగే మూడు కలర్ ఫొటోలతో ఉదయం ఏడు గంటలకు హాజరు కావాలన్నారు. >Share it

Similar News

News March 10, 2026

కలుపు ముప్పు తగ్గాలంటే ఇలా చేయాలి

image

పంట వేసేందుకు పొలాన్ని 2 నుంచి 3 దఫాలుగా దున్నడం వల్ల తొలిదశలోనే కలుపు విత్తనాలు మెులిచి మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్, పంట వ్యర్థాలను, వరి గడ్డిని నేలపై చదునుగా పరచడం, అంతరకృషి వంటివి కలుపును తగ్గించి పంటకు, నేలకు మేలు చేస్తుందనే వాస్తవాన్ని రైతులు తెలుసుకోవాలి. కలుపు మందును వాడాల్సి వస్తే తప్పకుండా నిపుణులు సూచన మేరకే వాడాలి. వ్యాపారుల ప్రమేయం ఉండకపోవడం మంచిది.

News March 10, 2026

టీమ్ ఇండియాకు రూ.131 కోట్లు

image

T20WC సొంతం చేసుకున్న టీమ్ ఇండియాకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఏకంగా రూ.131 కోట్ల భారీ రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లతోపాటు సపోర్ట్ స్టాఫ్, కోచింగ్ బృందానికి ఈ మొత్తాన్ని అందజేయనుంది. వరుసగా రెండుసార్లు, మొత్తం మూడు సార్లు ట్రోఫీని సాధించినందుకు కంగ్రాట్స్ చెప్పింది.

News March 10, 2026

దేశంలోనే 3rd రిచెస్ట్ మహిళా ఎమ్మెల్యేగా లోకం మాధవి

image

మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోనే టాప్-10 రిచెస్ట్ మహిళా MLA, MPల లిస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మన నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి రూ.291 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అదేవిధంగా కోవూరు MLA ప్రశాంతి రెడ్డి రూ.716 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. కడప MLA రెడప్ప గారి మాధవి రూ.388 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. మొదటి మూడు స్థానాల్లో ఏపీ ఎమ్మెల్యేలే ఉండటం విశేషం.