News August 2, 2024
విశాఖ: కానిస్టేబుల్ మీద దాడి చేసిన వ్యక్తిపై రౌడీషీట్

ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 29వ తేదీ రాత్రి పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కె.వినయ్ పై రౌడీషీట్ తెరిచినట్లు సీఐ సంజీవరావు తెలిపారు. ఇప్పటివరకు వినయ్ పై 9 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. దాడి చేసిన తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. అతడిని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
‘ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

VMRDAకి చెందిన అన్ని కళ్యాణ మండపాల బుకింగ్‌లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. బుధవారం VMRDA బాలల థియేటర్లో ఆయన ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ప్రజలకు VMRDA సేవలు పారదర్శకంగా కల్పించేందుకు ఆన్లైన్ సేవలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్‌లోనే కళ్యాణమండపం రుసుము, తదితర వివరాలు ఉంటాయని పేర్కొన్నారు.
News July 9, 2025
ద్వారకానగర్: పిల్లలకు సెలవు.. పేరెంట్స్ వెళితే గేట్లకు సీల్

ద్వారకానగర్‌లోని రవీంద్ర భారతీ స్కూల్ 3 రోజులుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా అసలు నిజం బయటపడింది. సిబ్బందికి ESI కల్పించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటికి స్పందన లేకపోవడంతో స్కూల్‌కు సీల్ వేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మేనేజ్‌మెంట్ పిల్లలకు సెలవు ప్రకటించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న DEO ప్రేమ్ కుమార్ ESI అధికారులతో మాట్లాడారు.
News July 9, 2025
సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.