News September 29, 2025
విశాఖ: కాలుతో పరీక్ష రాసి టీచర్ అయ్యాడు..!

అవును మీరు చదివింది నిజమే. కొత్తవలస మండలం గనిశెట్టిపాలేనికి చెందిన జామి సింహాచలం నాయుడికి పుట్టకతోనే అంగవైకల్యం. విశాఖలో కష్టపడి చదివారు. మెగా డీఎస్సీలో ఎడమ కాలుతో పరీక్ష రాసి టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో 320వ ర్యాంకు, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించాడు. దీంతో ఆయనను విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు.
Similar News
News September 29, 2025
2 విశాఖలో మాంసం విక్రయాలు బంద్

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విశాఖ నగరంలో అక్టోబర్ 2వ తేదీన జంతువధ చేయరాదని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కోరారు. ఆ రోజు నగరమంతా మాంసం విక్రయాల నిషేధం ఉంటుందన్నారు. ఎవరైనా చేపలు, ఇతరం మాంసం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జీవీఎంసీ హెల్త్, పారిశుద్ధ్య విభాగ అధికారులు ఆరోజు తనిఖీలు చేయాలని కమిషనర్ ఆదేశించారు.
News September 29, 2025
విశాఖలో మూడు బైకులు దగ్ధం

జాలరిపేటలో తెల్లవారుజామున మూడు బైకులు పూర్తిగా కాలిపోయాయి. మరో బైకు సగం కాలిపోయి ఉన్నాయని బాధితులు ఎంవిపి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ధనుంజయ్ ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎవరైనా కావాలానే కాల్చేశారా.. లేక షార్ట్‌సర్క్యూట్ కారణమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News September 29, 2025
విద్యాలక్ష్మి అమ్మవారిగా కనకమహాలక్ష్మి దర్శనం

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం కనకమహాలక్ష్మి అమ్మవారిని విద్యాలక్ష్మి అవతారంలో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మొదటి పూజా కార్యక్రమం ఈవో శోభ రాణి, ఏఈఓ రాజేంద్రకుమార్ ఇతర సిబ్బంది నిర్వహించగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.