News November 29, 2024
విశాఖ కాస్త వైజాగ్‌గా ఎలా మారింది?

విశాఖ పేరు వెనుక ఒక చరిత్రే ఉంది. వైశాఖేశ్వరుని ఆలయం చుట్టూ నగరం విస్తరించిందని, వైశాఖ కాస్త విశాఖగా మారిందని పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నగరంలో కుమార స్వామి ఆలయం ఉండేదని అతని నక్షత్రం విశాఖ కావడంతో నగరానికి ఆ పేరు వచ్చిందనేది మరో కథనం. కాగా బ్రిటిష్ వారు విశాఖపట్నం పేరు పలకలేక వైజాగపట్నం అనే వారు. అది కాస్త వైజాగ్‌గా మారింది. నగరానికి విశాఖ పేరు ఎలా వచ్చిందో మీకు తెలిసిన కథ కామెంట్ చేయండి.
Similar News
News December 27, 2025
విశాఖలో మాతా శిశు మరణాల పరిస్థితి ఇదే..

విశాఖ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే మాతా శిశు మరణాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023-24 ఏడాదిలో 25,456 శిశువులు జన్మించగా 102 శిశు, 20 మాతృ మరణాలు, 2024-25 ఏడాదిలో 24,198 శిశువులు జన్మించగా 324 శిశు, 14 మాతృ మరణాలు సంభవించాయి. 2025-26 ఏడాదిలో 14,880 శిశువులు జన్మించగా 70 శిశు, 7 మాతృ మరణాలు నమోదు అయ్యాయి.
News December 27, 2025
విశాఖలో స్వల్పంగా తగ్గిన గుడ్డు ధర!

గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయికి చెరుకున్న గుడ్డు హోల్ సేల్ ధర స్వల్పంగా తగ్గింది. నిన్నటి వరకు ట్రే(30 గుడ్లు) రూ.220 ఉంటే ఈ రోజు రూ.210 ఉంది. హోల్ సేల్ గుడ్డు రూ. 7కు అమ్ముతున్నారు. రిటైల్లో మాత్రం గుడ్డు 8 రూపాయలు ఉంది. గత నెల రోజులుగా ధర పెరుగుతుండగా.. ప్రస్తుతం 100 గుడ్లకు గాను రూ.36 తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక నుంచి గుడ్డు ధర నిలకడగా ఉండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
News December 27, 2025
విశాఖలో ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను డిసెంబర్ 31న ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆ రోజు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారని చెప్పారు. పంపిణీ సజావుగా జరిగేందుకు డిసెంబర్ 30న నగదు డ్రా చేసేందుకు ఆదేశించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.


