News January 29, 2025

విశాఖ కేంద్ర కారాగారంలో అందుబాటులోకి ఆన్లైన్ ములాఖత్

image

విశాఖ కేంద్ర కారాగారంలో ఆన్‌లైన్‌లో ముందుగా ములాఖత్ రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ మహేశ్ బాబు తెలిపారు. https://eprisons.nic.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుని ముందుగా ములాఖత్ డేట్ తీసుకోవచ్చని తెలిపారు. ఒక్కో ములాఖాత్‌కు ముగ్గురు విజిటర్స్ సంబంధిత ఖైదీని కలిసి మాట్లాడుకునే సదుపాయం ఉందన్నారు. రిమాండ్ నిందితులకు వారానికి రెండు ములాఖత్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News December 18, 2025

భీమిలి తీరానికి కొట్టుకు వచ్చిన తాబేలు, డాల్ఫిన్

image

భీమిలి తీరానికి డాల్ఫిన్, తాబేలు కొట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు డాల్ఫిన్, ఇతర చేపలు తీరానికి కోట్టుకు రాలేదని జాలర్లు తెలిపారు. కెమికల్ ఫ్యాక్టరీ విడిచి పెడుతున్న వ్యర్ధాల కారణంగా సముద్ర జలాలు కలుషితమయ్యాయని, దీంతో విలువైన మత్స్య సంపద నాశనమౌతోందని వారు ఆవేదన చెందారు. కాలుష్యం వెదజల్లుతున పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

News December 18, 2025

బురుజుపేట: సాయంత్రం 4 గంటల నుంచి దర్శనాల నిలిపివేత

image

బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. మార్గశిర మాసం ఆఖరి గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. సహస్ర ఘట్టాభిషేకానికి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టగా సాయంత్రం 4 గంటల నుంచి ఏడు గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించనున్నారు.

News December 18, 2025

విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు: కలెక్టర్

image

విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, కాలుష్య కారకాలను గుర్తించి వాటి తీవ్రత తగ్గించేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.