News December 22, 2025
విశాఖ: కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి

కేజీహెచ్‌లో వైద్యం కోసం వెళ్లిన రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ స్వర్ణలత మృతి చెందింది. దీనిపై మృతురాలి బంధువులు కేజీహెచ్ సూపరింటెండెంట్, టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఆమె ఓపీ కోసం వెళ్లగా.. వెంటిలేటర్‌పై ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. అయితే తరలించడంలోనూ నిర్లక్ష్యం వహించడం వలనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
Similar News
News December 22, 2025
VJA: డ్రగ్స్ మూలాలపై పోలీసుల ఆరా.. అరెస్ట్ అయ్యింది వీరే.!

విజయవాడలో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి MDMA డ్రగ్స్ సేవిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన <<18637322>>విషయం తెలిసిందే<<>>. మధురానగర్‌కు చెందిన జగదీశ్ కుమార్, అఖిలేశ్‌లను అదుపులోకి తీసుకోగా, నెల్లూరుకు చెందిన రాజేశ్ అనే వ్యక్తి పరారయ్యాడు. నిందితుల వద్ద నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకొని, అరెస్టయిన వారిని రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
News December 22, 2025
BSNL బంపర్ ఆఫర్.. రూపాయికే!

కొత్త యూజర్లను ఆకర్షించేందుకు BSNL తన ఫ్రీ సిమ్ ప్లాన్‌ను మరోసారి తీసుకొచ్చింది. క్రిస్మస్, న్యూఇయర్ కానుకగా రూ.1కే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2 జీబీ డేటా, 100 SMSలు అందించనున్నట్లు పేర్కొంది. సిమ్ ఉచితంగా లభించినా రూపాయితో రీఛార్జ్ చేస్తేనే పై ఫీచర్లు పొందొచ్చు. ఈ ఆఫర్ వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకూ అందుబాటులో ఉండనుంది.
News December 22, 2025
జాకబ్ డఫీ హిస్టరీ క్రియేట్ చేశాడు

న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆ దేశం తరఫున ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు(81) తీసిన ప్లేయర్‌గా నిలిచారు. దీంతో ఆ దేశ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ(79w-1985)ను అధిగమించారు. కాగా డఫీ ఈ ఏడాది 4 టెస్టులు, 11 వన్డేలు, 21 టీ20లు ఆడారు. మరోవైపు మూడో టెస్టులో వెస్టిండీస్‌పై NZ 323 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో 2-0తో సిరీస్‌ను వశం చేసుకుంది.


