News April 24, 2025
విశాఖ: కొద్దిరోజుల్లో పెళ్లి.. యువతి ఆత్మహత్య

మరికొద్ది రోజుల్లో వివాహం అనగా ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో గురువారం జరిగింది. టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు వివరాల ప్రకారం.. నగరంలోని కల్లుపాకల ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి ఓ యువకుడిని ప్రేమించింది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం KGHకు తరలించారు.
Similar News
News April 24, 2025
నేడు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళికు నివాళులర్పించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ రానున్నారు. తిరుపతి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు సాయంత్రం 6.15కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పాండురంగపురం వెళ్లి చంద్రమౌళికి నివాళి అర్పిస్తారు. రాత్రికి విశాఖలోనే బస చేసి, శుక్రవారం ఉదయం 9.15 గంటలకు విమానంలో రాజమండ్రికి బయలుదేరుతారు.
News April 24, 2025
విశాఖలో పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జె.సుభద్రతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. వీరు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలమైన భారతదేశానికి బలమైన గ్రామ పాలన అవసరమని జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు.
News April 24, 2025
కంచరపాలెం: బస్సు ఢీకొని మహిళ మృతి

కంచరపాలెం ఊర్వశి జంక్షన్ దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మహిళలను విజయవాడ నుంచి పార్వతీపురం వైపు వెళుతున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న ఎన్.మేరీ (62 ) అక్కడికక్కడే చనిపోగా, డ్రైవ్ చేస్తున్న కూతురు సుధారాణి(40)కి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.