News April 24, 2025
విశాఖ: కొద్దిరోజుల్లో పెళ్లి.. యువతి ఆత్మహత్య

మరికొద్ది రోజుల్లో వివాహం అనగా ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో గురువారం జరిగింది. టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు వివరాల ప్రకారం.. నగరంలోని కల్లుపాకల ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి ఓ యువకుడిని ప్రేమించింది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం KGHకు తరలించారు.
Similar News
News April 24, 2025
సైన్యం సిద్ధంగా ఉండాలి: పాక్ ప్రభుత్వం

పహల్గాం దాడిపై భారత్ తీవ్రంగా స్పందిస్తుండటంతో పాక్ అప్రమత్తమైంది. సైనికులకు సెలవులు రద్దు చేసిన పాక్ ప్రభుత్వం, ఇప్పటికే లీవ్‌లో ఉన్నవారు వెంటనే వెనక్కి రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక భారత్ దాడి చేస్తే తిప్పికొట్టేందుకు, దేనికైనా సిద్ధంగా ఉండాలని సైనికులకు స్పష్టం చేసిందట. అటు ఎయిర్ అటాక్స్ భయంతో భారత విమానాలకు తమ గగనతలం నుంచి ప్రయాణించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
News April 24, 2025
పాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ వెబ్‌సైట్ క్లోజ్

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ క్రమంలో స్టాక్ ఎక్స్‌ఛేంజ్ వెబ్‌సైట్‌ను ఆ దేశం క్లోజ్ చేసింది. ఇవాళ ఉదయం నుంచే నష్టాల్లో ట్రేడ్ ప్రారంభించిన ఆ దేశ స్టాక్ మార్కెట్లు 2 శాతానికి పైగా షేర్లు కోల్పోయాయి. మున్ముందు మరింత పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News April 24, 2025
జిల్లాలో నేరాలు అదుపులో ఉంచాలి: ASF SP

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష ఎస్పీ శ్రీనివాస్ రావు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO& రేప్ కేసులు, ప్రాపర్టీ, దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ & ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, నకిలీ విత్తనాలు గురించి చర్చించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు.