News May 17, 2024

విశాఖ: ‘కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి’

image

జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు, ఇతర అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున సూచించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశం నిర్వహించారు. పోలింగ్ అనంతరం ఆయా స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎంల తరలింపు, ఇతర సాంకేతిక ప్రక్రియల పూర్తి, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సమర్థవంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు.

Similar News

News September 30, 2024

విశాఖ వేదికగా క్రికెట్ మ్యాచ్

image

రంజీ ట్రోఫీలో ఆడే ఆంధ్ర జట్టుకు రికీ బుయ్ మరోసారి నాయకత్వం వహించనున్నారు. వచ్చేనెల 11న తొలి మ్యాచ్‌లో విదర్బతో ఆంధ్ర జట్టు తలపడనుంది. 18న గుజరాత్‌తో, 26న హిమాచల్ ప్రదేశ్‌తో ఆంధ్ర జట్టు ఆడనుంది. విశాఖ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ జరగనుంది. విశాఖ ప్లేయర్ రికీ బుయ్ కెప్టెన్‌గా, షేక్ రషీద్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

News September 30, 2024

స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎండీగా ఎంఓఐఎల్ ఛైర్మన్ అజిత్ కుమార్ సక్సెనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టీల్‌ప్లాంట్ నూతన సీఎండీగా ఎస్.శక్తిమణి ఇప్పటికే సెలెక్ట్ అయ్యారు. గత సీఎండీ అతుల్ భట్ ఉద్యోగ కాలం నవంబర్ నెలాఖరు వరకూ ఉంది. అంతవరకూ అజిత్ కుమార్ సక్సేనా సీఎండీగా వ్యవహరించనున్నారు.

News September 29, 2024

ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’

image

ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.