News January 1, 2025

విశాఖ: ‘గుడ్లు కూడా క్యాచ్ అంటూ విసిరేవాడు’

image

విశాఖ కుర్రాడు నితీశ్ సెంచరీ చేయడంపై అతని చిన్నప్పటి కోచ్ కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. నితీశ్‌కు 8 ఏళ్లు ఉన్నప్పుడు అతని తండ్రి ముత్యాల నాయుడు తన దగ్గరకు తీసుకొచ్చాడని చెప్పారు. ఇంట్లో చాలా అల్లరి చేస్తున్నాడు.. చివరికి కోడి గుడ్లు కూడా క్యాచ్ అంటూ విసురుతున్నాడు కోచింగ్ ఇవ్వండి అన్నారని తెలిపారు. నితీశ్ ఆట చూసి అప్పుడే తన ఆటోగ్రాఫ్‌ను బ్యాట్ పై తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 4, 2025

విశాఖ: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్ లో జిల్లా ఇంచార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈనెల 8న ప్రధాని విశాఖలో పర్యటించి అనకాపల్లి, విశాఖ జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.

News January 4, 2025

ప్రధాని పర్యటనపై సీఎస్ సమీక్ష

image

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన విశాఖ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అమరావతి నుంచి అనకాపల్లి విశాఖ, కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సమీక్షించారు. ప్రధాని పర్యటనకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలను బస్సులు ఇతర వాహనాల్లో సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. వాహనాల ట్రాఫిక్ పార్కింగ్‌పై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.

News January 3, 2025

విశాఖలో ప్రధాని సభకు లక్ష మంది..!

image

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రానున్న తరుణంలో ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో ప్రధానమంత్రి సభకు దాదాపు లక్ష మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు, చెట్లు ట్రిమ్మింగ్, గ్రౌండ్ ఎత్తు పల్లాలు లేకుండా చదును చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.