News February 28, 2025

విశాఖ-గుణుపూర్ పాసెంజర్‌కు అదనపు బోగి

image

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖ – గుణుపూర్ (58505/06) పాసెంజర్‌కు అదనపు బోగి వేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు అదనపు స్లీపర్ కోచ్ ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా అదనపు బోగి సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News February 28, 2025

ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడపాలి: విశాఖ కలెక్టర్

image

జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. గాజువాక, ఆటోనగర్, పెదగంట్యాడ, అగనంపూడిలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం గుర్తించాలన్నారు. ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడపాలని ఆదేశించారు.

News February 28, 2025

విశాఖ: సెల్ఫీకి నేను రెఢీ.. మరి మీరు రెఢీనా..!

image

వన్యప్రాణుల హావభావాలను మంత్రముగ్ధులు కాని వారు ఎవరూ ఉండరు. మానవ నేస్తాలుగా వన్యప్రాణులు వ్యవహరిస్తూ విశాఖ జూపార్క్‌లో ఒక సాంబార్ డీర్ అందరినీ ఆకట్టుకుంటుంది. కళాశాల విద్యార్థులు,సందర్శకులు దీనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడానికి నేను రెఢీ.. మరి మీరు రెఢీనా అన్నట్లుగా ఏమాత్రం భయం లేకుండా ఆ సాంబార్ డీర్ సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. ఇలాంటి దృశ్యాలు ఎన్నో జూలో సాక్షాత్కరిస్తాయి.

News February 28, 2025

విశాఖలో చిట్టీల పేరుతో మోసం

image

విశాఖలో చిట్టీల పేరుతో మోసం చేసిన దంపతులు అరెస్ట్ అయ్యారు. మల్కాపురానికి చెందిన దంపతులు మోహన్ రావు, లక్ష్మి చిట్టీల పేరుతో తనను మోసం చేశారని పెద్ద గంట్యాడకు చెందిన లక్ష్మీ న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనే వీరి వ్యవహరంపై సీపీని బాధితులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యూపోర్ట్ CI కామేశ్వరరావు వీరిద్దరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. మార్చి 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

error: Content is protected !!