News November 21, 2024
విశాఖ గ్యాంగ్ రేప్ నిందితులకు రిమాండ్
విశాఖలో లా విద్యార్థిని పై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రేమ పేరుతో వలవేసి బాధితురాలికి చేరువై.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతోపాటు అతడి స్నేహితులు జగదీశ్, ఆనంద్, రాజేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితులకు వచ్చే నెల 2వరకు రిమాండ్ విధించింది.
Similar News
News November 21, 2024
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. విశాఖలో ఐటీ హిల్స్‌పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్‌ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
News November 21, 2024
వాల్తేరు తాత్కాలిక డీఆర్ఎంగా మనోజ్ కుమార్ సాహు
వాల్తేరు తాత్కాలిక డీఆర్ఎంగా మనోజ్ కుమార్ సాహును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా గతంలో డీఆర్ఎంగా పనిచేసిన సౌరభ్ ప్రసాద్‌ను సీబీఐ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఓ టెండర్ విషయమై అవినీతికి పాల్పడుతూ సీబీఐ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రైల్వే నూతన డిఆర్ఎంగా మనోజ్ కుమార్ సాహును ప్రభుత్వం నియమించింది.
News November 21, 2024
మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ ప్రారంభం: లోకేశ్
మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ ప్రారంభిస్తామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ హాల్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద ఎత్తున హోటళ్లు తీసుకొస్తామన్నారు. టాప్ 100 ఐటీ కంపెనీలు విశాఖలో ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తున్నామన్నారు.