News October 26, 2024

విశాఖ: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా హిందుస్థాన్ షిప్ యార్డ్

image

విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా ముందడుగు వేస్తోంది. సముద్రంలో ఉపయోగించే పరికరాలకు గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి సాంకేతికతను కొరియన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీ అసోసియేట్, లోటస్ వైర్ లెస్ ప్రైవేట్ సంస్థతో కలిసి తయారు చేసినట్లు హిందుస్థాన్ షిప్ యార్డ్ తెలిపింది. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ పనిచేస్తుందని తెలియజేసింది.

Similar News

News September 17, 2025

విశాఖలో హెల్త్ క్యాంప్‌ను సందర్శించిన సీఎం

image

CM చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ <<17736648>>హెల్త్ క్యాంప్‌<<>>ను సందర్శించారు. గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లకు మహిళలు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించి విలేజ్ క్లీనిక్ సెంటర్‌లో టెస్ట్‌లు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ CMకి వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన CM ఓ చంటి బిడ్డకు డ్రాప్స్ వేశారు.

News September 17, 2025

విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు బుధవారం విశాఖ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి AU సాగరిక ఫంక్షన్ హాల్‌కు బయలుదేరింది. మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ హెల్త్ క్యాంప్‌ సందర్శిస్తారు. అనంతరం AU కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించే సభలో పాల్గొంటారు.

News September 17, 2025

విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

image

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్‌పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.